అమ్మ ఇచ్చిన రంగుతోనే నటిస్తా!

- Advertisement -
Raghava Lawrence

రాఘవ లారెన్స్ నటించిన కొత్త చిత్రం.. “జిగర్ తండ డబుల్ ఎక్స్”. తమిళంలో సూపర్ హిట్ అయిన “‘జిగర్ తండ” (తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా “గద్దలకొండ గణేష్”) చిత్రానికిది సీక్వెల్. ఈ సినిమాలో లారెన్స్ ఎటువంటి మేకప్ వేసుకోకుండా నటించడాట.

“ఈ చిత్రానికి మేకప్ వాడలేదు. మేకప్ లేకపోతే నేను ఎలా ఉంటానో స్క్రీన్ పై అని భయపడ్డా. అందుకే దర్శకుడు మేకప్ లేకుండా నటించమని అడిగితే మొదట నో అని చెప్పాను. కానీ స్క్రీన్ మీద చూసుకున్నాక నా మీద నమ్మకం ఏర్పడింది. మా అమ్మ ఇచ్చిన కలర్‌తోనే ఇకపై కనిపించాలనేంత నమ్మకం వచ్చింది,” అని అన్నారు లారెన్స్.

ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్.జె. సూర్య నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ దీపావళికి విడుదల కానుంది.

ఇటీవలలారెన్స్, కంగన నటించిన “చంద్రముఖి 2” దారుణ పరాజయం పాలైంది. “నేను హీరో కావడమే గొప్ప. నాకున్న కలర్ కి, ఫేస్ కి హీరో అవగలరా? అయినా ఆ సినిమాలో నలుగురు హీరోయిన్లతో నటించా. ఇంకా అందులో హిట్, ఫ్లాప్ లు అని ఏమి ఆలోచిస్తాం?,” అని ఫిలాసఫికల్ గా సమాధానం ఇచ్చారు లారెన్స్.

 

More

Related Stories