శేఖర్ లో నేను హీరోను కాదు – రాజశేఖర్

రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా క్లయిమాక్స్ కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. రాజశేఖర్ ఇలాంటి కథాబలం ఉన్న సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు. శేఖర్ సినిమా, నటుడిగా రాజశేఖర్ ను మరో మెట్టు పైకి ఎక్కించిందని చెబుతున్నారు.

అయితే ఈ క్రెడిట్ ను రాజశేఖర్ తీసుకోవడం లేదు. అసలు శేఖర్ సినిమాలో తను హీరోనే కాదంటున్నారు ఈ సీనియర్ నటుడు. సబ్జెక్ట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెబుతున్నారు.

“నేను ఎప్పుడూ సబ్జెక్ట్ కే ఇంపార్టెన్స్ ఇస్తాను. హీరో నేను కాదు, కథ మాత్రమే అంటాను. శేఖర్ సినిమాకు కూడా హీరో నేను కాదు. ఈ సినిమా కథే హీరో. ఈ కథకు లైఫ్ ఇచ్చిన జీవిత, అనూప్ ఈ సినిమాకు హీరోలు. ఈ రీమేక్ ఇంత బాగా రావడానికి వీళ్లే కారణం. పైగా ఇది రీమేక్ అవ్వడం వల్ల నేను ప్రత్యేకంగా యాక్టింగ్ పరంగా దృష్టిపెట్టిందేం లేదు. ఫీల్ చెడకుండా చూసుకున్నానంతే. ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే దానికి కారణం ఆ కథలో గొప్పదనం, ఆ తర్వాత జీవిత డైరక్షన్.”

ఇలా శేఖర్ సక్సెస్ ను జీవితకు ఆపాదించే ప్రయత్నం చేశారు రాజశేఖర్. ఈ సినిమాలో ఆయన పోషించిన శేఖర్ పాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వయసుకు తగ్గ పాత్ర పోషించారని అంతా మెచ్చుకుంటున్నారు. ఈ ప్రోత్సహంతో భవిష్యత్తులో మరిన్ని మంచి కథల్లో నటిస్తానని చెబుతున్నారు రాజశేఖర్.

 

More

Related Stories