రివ్యూ: ఇచ్చట వాహనములు నిలుపరాదు

Ichata Vahanmulu Niluparadu

ఓ అమాయకుడు కేసులో ఇరుక్కోవడం, హీరో తప్పించడం లాంటి కథలు చాలానే చూశాం. “ఇచ్చట వాహనములు రాదు” అనే సినిమా స్టోరీ కూడా ఇదే. కాకపోతే దీనికి బైక్ అనే ఎలిమెంట్ ను యాడ్ చేశారు. అలా చేయడం వల్ల కొత్తదనం వస్తుందని భావించారు. కానీ మేకర్స్ అనుకున్నది జరగలేదు. కొత్తదనం దేవుడెరుగు, ఉన్న స్టఫ్ కూడా ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

సినిమా స్టార్ట్ అవ్వడమే కాస్త ఇబ్బందికరంగా స్టార్ట్ అవుతుంది. రొటీన్ సన్నివేశాలు ఇబ్బందిపెడతాయి, పస లేని స్క్రీన్ ప్లే చిరాకు తెప్పిస్తుంది. ఇక చాల్లే అనుకున్న దర్శకుడు, ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి ట్విస్ట్ ఇస్తాడు. సెకెండాఫ్ నుంచి కథ సీరియస్ మోడ్ లోకి వెళ్తుందనుకుంటే అది కూడా జరగలేదు. ఫస్టాఫ్ లో చేసిన తప్పుల్నే, సెకెండాఫ్ లో రిపీట్ చేశాడు దర్శకుడు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ బైక్ నేర్చుకోవడానికి హీరో ఎన్ని ఇబ్బందులు పడతాడో, మొదటిసారి సినిమా తీసిన దర్శకుడు దర్శన్ కూడా అన్ని ఇబ్బందులు పడ్డాడు. అవన్నీ తెరపై అడుగడుగునా కనిపిస్తాయి కూడా.

చెన్నైలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నానని చెప్పాడు దర్శకుడు. యదార్థ ఘటనల ఆధారంగా తీసినప్పుడు అంతే ఒరిజినాలిటీ చూపిస్తే బాగుండేది. కానీ ఆ ఘటనలకు తనదైన కామెడీ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు యాడ్ చేయడానికి ప్రయత్నించి బోల్తా కొట్టాడు దర్శకుడు. చివరికి అటు సీరియస్ గా చూపించలేక, ఇటు నవ్వులు పండించలేక చతికిలపడ్డాడు. ఉన్నంతలో వెన్నెల కిషోర్, సునీల్ ఫర్వాలేదనిపిస్తారు.

అరుణ్ (సుశాంత్) ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంటాడు. అదే ఆఫీస్ లో ఇంటర్న్ గా జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌదరి). ఇద్దరూ ప్రేమలో పడతారు. ఓరోజు మీనాక్షి అన్న (వెంకట్), కుటుంబ సభ్యులంతా శ్రీశైలం వెళ్లడంతో, బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలుస్తుంది మీనాక్షి. కొత్త బైక్ వేసుకొని ప్రేయసి ఇంటికి బయల్దేరిన అరుణ్, చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఇబ్బందుల్లో పడతాడు, మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో అతడి ఫ్రెండ్ పులి (ప్రియదర్శి) పోలీస్ స్టేషన్ లో పడతాడు. ఆ కాలనీ నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, ఫ్రెండ్ ను ఎలా కాపాడుకున్నాడనేది బ్యాలెన్స్ కథ.

ఇబ్బందికరంగా సాగే ఈ సినిమాలో సుశాంత్ మాత్రం రాణించాడు. ఉన్నంతలో తన పాత్రను రక్తికట్టించడానికి చాలానే కష్టపడ్డాడు. అతడి లుక్ బాగుంది. కొత్త పిల్ల మీనాక్షి చౌదరి గ్లామరస్ గా ఉంది. కానీ ఆమెకు నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెరపైకొచ్చిన వెంకట్, తన పాత్రకు న్యాయం చేయగా.. సునీల్, ప్రియదర్శి, అభినవ్, వెన్నెల కిషోర్ లాంటి నటులంతా తమ పాత్రల మేరకు నటించారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు  ఈ సినిమాకు సమస్యంతా దర్శకుడితోనే వచ్చింది. ఇదే పాయింట్ ను మలయాళం సినిమాల టైపులో ఇంట్రెస్టింగ్ గా, సీట్-ఎడ్జ్ థ్రిల్లర్ గా కూడా చెప్పొచ్చు. లేదంటే కొన్ని ఫన్నీగా లాగిస్తూ, ఇంటర్వెల్ నుంచి కథనాన్ని పరుగులుపెట్టించొచ్చు. కానీ దర్శన్ మాత్రం నవరసాలు మిక్స్ చేసి, పక్కా తెలుగు సినిమా తీశాడు. అక్కడే ఈ కిచిడీ తేడా కొట్టింది.

Rating: 2.25/5

Advertisement
 

More

Related Stories