ఐకాన్ స్టార్ కి న్యూయార్క్ లో గౌరవం!

- Advertisement -

అల్లు అర్జున్ కి లభించిన అరుదైన గౌరవం లభించింది. ఏటా న్యూయార్క్ లో జరిగే ఇండియా డే పరేడ్ కి ఈసారి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వెళ్లారు. సాధారణంగా బాలీవుడ్ తారలను, క్రికెటర్లను ఈ ఈవెంట్ కి మెయిన్ గెస్ట్ లుగా వెళ్తుంటారు.

కానీ, ఈ ఏడాది ‘పుష్ప’స్టార్ కి ఆ గౌరవం దక్కింది. అ గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి హాజరయ్యారు, దాదాపుగా ఈ పరేడ్ కి లక్షల మంది భారతీయలు వచ్చారు. జెండా ఊపి పరేడ్ ని ప్రారంభించారు అల్లు అర్జున్.

అనంతరం అల్లు అర్జున్ న్యూయార్క్ నగర మేయర్ ని కూడా కలిసి ముచ్చటించారు. నగర్ మేయర్ తో మీటింగ్ గురించి అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారు.

మరోవైపు, ఈ రోజు ‘పుష్ప 2’ సినిమా లాంఛనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించుకొంది.

 

More

Related Stories