ఐకాన్ స్టార్ తోనే ఐకాన్: దిల్ రాజు

Allu Arjun

అల్లు అర్జున్ ఇటీవలే తనకున్న ‘స్టైలిష్ స్టార్’ అనే బిరుదుని తొలగించేశాడు. ‘ఐకాన్ స్టార్’ అని తగిలించుకున్నాడు. ఎందుకంటే, ‘స్టైలిష్ స్టార్’ అనే బిరుదులో నటన గురించి మాట లేదంట. అందుకే ఐకాన్ స్టార్ అని మార్చాము అని దర్శకుడు సుకుమార్ వివరణ ఇచ్చారు. మరి ‘ఐకాన్’లో నటనకి సంబంధించి అర్థం ఏముందో సుకుమార్ కే తెలియాలి. ఏది ఏమైనా… ఈ ఐకాన్ స్టార్ రెండేళ్ల క్రితమే ‘ఐకాన్’ అనే సినిమా చేస్తాడు ప్రకటన వచ్చింది.

మళ్లీ ఇన్నేళ్లకి ఆ ‘ఐకాన్’ సినిమా ఉంటుంది అని దిల్ రాజు అంటున్నారు. ‘వకీల్ సాబ్’ దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్షన్లోనే ఈ మూవీ ఉంటుందంట.

బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అది పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మూవీ చేస్తాడా లేక ‘ఐకాన్’ కి ఒప్పుకుంటాడా అనేది చూడాలి. ‘పుష్ప’ షూటింగ్ పూర్తి కాగానే శివ కొరటాల డైరెక్షన్లో మూవీ చేస్తాను అని గతంలో ప్రకటించాడు బన్నీ. ఐతే, కొరటాల ఇప్పుడు ఆ స్థానంలో ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. సో, ‘ఐకాన్’ సెట్ మీదకు వెళ్లేంత నమ్మలేం.

More

Related Stories