- Advertisement -

ఇళయరాజా సంగీతంలో ఒక మేస్ట్రో. మహాజ్ఞాని. సంగీత కళాకారులు దేవుడిగా భావిస్తారు. అంతటి గొప్పవాడు ఆయన. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించిన ఇళయరాజా ఈ వయసులోనూ సంగీత కచేరీలు ఆపడం లేదు. సంగీతసాగరంలోనే నిత్యం తలమునకలై ఉంటారు.
మరోసారి హైదరాబాద్ సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేయడానికి ఆయన వస్తున్నారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో అతి పెద్ద కచేరి నిర్వహించనున్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో ‘హైదరాబాద్ టాకీస్’ వారు నిర్వహించనున్న ఈ భారీ ఈవెంట్ లో స్వర జ్ఞాని మ్యూజికల్ షో ఉంటుంది.
నేడే మీ టికెట్లని పేటిఎం మరియు పేటిఎం ఇన్సైడర్ లో బుక్ చేసుకోండి.