మాల్దీవుల్లో ఇలియానా బికినీ సెల్ఫీ!

Ileana


ఇలియానా మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో మంటలు పుట్టించింది. “ఫైర్” ఇమోజీలతో కాకా రేగింది ఆమె టైంలైన్లో. దీనికంతటికి కారణం ఆమె షేర్ చేసిన బికినీ సెల్ఫీ. ఆమె బికినీ ఫోటోలు పెట్టడం కొత్త కాదు. కానీ, ఇటీవల ఆమె వాటిని తగ్గించింది. మళ్లీ ఆ ట్రెండ్ మొదలు పెట్టింది.

ఇలియానా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ లో ఉంది. బాలీవుడ్ భామ కత్రిన కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ కొందరు మిత్రులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కత్రిన పుట్టిన రోజు వేడుకలను అక్కడే జరిపారు. ఆ గ్యాంగ్ లో ఇలియానా వెళ్ళింది.

మొదటి మూడు రోజులు కత్రిన గ్యాంగ్ తో కలిసిన ఫోటోలను షేర్ చేసింది. సోమవారం (జులై 18) తన సోలో ఫోటోలు పోస్ట్ చేసింది. బీచ్ లో రిలాక్స్ అవుతూ సెల్ఫీ దిగింది. ఆ ఫొటో బాగా వైరల్ అయింది.

ఆ మధ్య ఇలియానా బాగా లావు అయింది. బరువు పెరిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇక నా బాడీ ఎట్లా ఉంటే అలాగే ఫోటోలు పెడుతా, అందంగా కనిపించాలనే ప్రయత్నం చెయ్యను అని రాసుకొంది. కానీ, ఈ బికినీ ఫోటోలు చూస్తే ఆమె మళ్ళీ స్లిమ్ అయినట్లు కనిపిస్తోంది.

 

More

Related Stories