గర్భవతినంటూ రూమర్ సృష్టించారు!

- Advertisement -
Ileana

హీరోయిన్ ఇలియానా తన విషయంలో పుట్టుకొచ్చిన రూమర్స్ గురించి మాట్లాడింది. హీరోయిన్లకి ప్రేమ పుకార్లు ఎక్కువగా వస్తుంటాయి. కానీ, తాను గర్భవతినంటూ గతంలో వచ్చిన పుకారు మాత్రం తనని బాగా షేమ్ గా ఫీలయ్యేలా చేసిందని ఇలియానా చెప్పుకొచ్చింది.

“అలాంటి ఫేక్ రూమర్ చాలా మానసిక వేదనకి గురి చేస్తాయి. మిగతా రూమర్ల గురించి నేను వర్రీ కాలేదు కానీ, ఈ దుష్ప్రచారం మాత్రం ఇబ్బంది పెట్టింది,” ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది ఇలియానా.

ఆమె తెలుగులో లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడు ఈ ప్రచారం జరిగింది. 2006లో విడుదలైన ‘దేవదేస్’ సినిమాతో అడుగుపెట్టిన ఇలియానా 2012 వరకు తెలుగులో ఊపేసింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిలయింది. ఇప్పుడు, హిందీలో వెబ్ డ్రామాలు, అడపాదడపా సినిమాలు చేస్తోంది.

 

More

Related Stories