
మరోసారి ఇలియానా తెలుగు తెరపై దర్శనమివ్వనుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలో హల్చల్ చేసిన ఇలియానాకి ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు.
ఐతే, ఇప్పుడు కాజల్ ఒక సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమెని సంప్రదిస్తున్నారని టాక్. కాజల్ ఇటీవల గర్భం దాల్చింది. దాంతో, ఆమె నాగార్జున సరసన నటించాల్సిన ‘ది ఘోస్ట్’ సినిమా నుంచి బయటికి వచ్చింది. ఆమె స్థానంలో పలువురు హీరోయిన్లని పరిశీలిస్తున్నారు. అందులో ఇలియానా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఐతే, ఇలియానా ఒక ఆప్షన్ మాత్రమే. ఇంకా పలువురు హీరోయిన్ల పేర్లని కూడా పరిశిలీస్తున్నారని టాక్. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, నిర్మతలు పలువురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి వారిని సంప్రదిస్తున్నారట. ఫైనల్ గా నాగార్జున ఎవరికి ఓటేస్తే వారే ఉంటారు.
ఆ మధ్య రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాలో నటించింది ఇలియానా. కానీ అది దారుణ పరాజయం పాలు అయింది. దాంతో, ఆమెని మళ్ళీ ఎవరూ అప్రోచ్ అవలేదు.