
మంగళవారం ఉదయాన్నే ఇలియానా అనౌన్స్ చేసిన వార్త సంచలనం కలిగించింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఆ పోస్ట్ పెట్టేంతవరకు ఆమె ఇప్పుడు ఎవరితో డేటింగ్ లో ఉందనే విషయం ఎవరూ పెద్దగా థింక్ చెయ్యలేదు. ఆమె సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదనే విషయం గురించి కూడా మీడియా ఫోకస్ పెట్టలేదు.
ఆమె పోస్ట్ పెట్టిన తర్వాత ఎంక్వయరీలు మొదలయ్యాయి. తల్లిని కాబోతున్నాను అంటూ ఇలియానా ఈ రోజు ఉదయం తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ALSO READ: Ileana announces her pregnancy
ఆమె గతంలో ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియాకి చెందిన ఫోటోగ్రాఫర్ ని పెళ్లి చేసుకొని ఏడాది కాగానే విడిపోయింది. ఆ తర్వాత ఆమె కత్రిన కైఫ్ సోదరుడు సెబాస్టియన్ (Sebastian Laurent Michel)తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కత్రిన కుటుంబం, ఆమె స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్లిన ఫోటోలను కూడా ఇలియానా ఆ మధ్య షేర్ చేసింది. ఆ ఫొటోల్లో సెబాస్టియన్ కూడా ఉన్నాడు.
ఐతే, సెబాస్టియన్ తో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉందని ఎవరూ భావించలేదు. ఇప్పుడు సడెన్ గా తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించడంతో వీరి బంధం ఇంత సీరియస్ అన్న విషయం అర్థమైంది. కత్రినా కైఫ్ సోదరుడుతో ఆమె సహ జీవనం చేస్తోంది. కానీ, వీరికి పెళ్లి జరిగిందా లేదా అన్నది క్లారిటీ లేదు.

ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే, డెలివరీలోపు చేసుకుంటారా అనేది చూడాలి. ఈ మధ్య పలువురు హీరోయిన్లు సడెన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం గర్భవతి అని గ్రహించడం. వారి రూట్లో ఈ భామ కూడా వెళ్తుందా?