ఇలియానా వ్రతం సగం పూర్తి

తన ఫిట్ నెస్ కు సంబంధించి 80 రోజుల వ్రతం చేపట్టానంటూ గతంలో ఇలియానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా బృహత్ కార్యంలో 40 రోజులు దిగ్విజయంగా పూర్తయ్యాయని ప్రకటించింది ఈ గోవా బ్యూటీ.

ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఫిట్ నెస్ పై దృష్టిపెట్టింది ఈ అమ్మడు. తిరిగి అవకాశాలు చేజిక్కించుకునేందుకు, మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేందుకు తన అందాలకు మెరుగులు అద్దే పనిలో పడింది. ఇందులో భాగంగా 80 రోజుల ఫిట్ నెస్ ప్రొగ్రామ్ ను ఛాలెంజింగ్ గా తీసుకుంది. అలా ఇప్పటివరకు 40 రోజులు పూర్తిచేసింది.

కార్డియో అంటే తనకు అసహ్యమని, కానీ ఇప్పుడు ఎక్సర్ సైజ్ అంటే ఎంతో ఇష్టంగా మారిందని, వ్యాయామం లేకుండా ఉండలేకపోతున్నానని అంటోంది ఇలియానా.

80 రోజుల ఫిట్ నెస్ వ్రతం ఫలించి ఈ గోవా బ్యూటీకి మళ్లీ అవకాశాలు రావాలని కోరుకుందాం.

Related Stories