ఇలియానా ప్లానింగ్ ఇదే!

సంప్రదాయ పండగల్ని పెద్దగా పట్టించుకోరు కానీ, నూతన సంవత్సర వేడుకల్ని మాత్రం హీరోయిన్లు మిస్సవ్వరు. 2 నెలల ముందు నుంచే డిసెంబర్ 31 రాత్రి పార్టీల కోసం ప్లాన్స్ సిద్ధం చేసుకుంటారు. హీరోయిన్ ఇలియానాకు కూడా ఇలాంటి ప్లాన్ ఒకటి ఉంది.

ఈసారి క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను అమెరికాలో జరుపుకోవాలని ఫిక్స్ అయింది ఇలియానా. దీనికి ఆమె ఓ కారణం కూడా చెబుతోంది. ఇలియానా తల్లి అమెరికాలో ఉంటోంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆమెను బాగా మిస్ అయిందట ఇలియానా. 5 నెలల పాటు తల్లి లేకుండా జీవించిందట.

రీసెంట్ గా ఓసారి అమెరికా వెళ్లి, అమ్మను కలిసి వచ్చానని, డిసెంబర్ నెలాఖరుకు మరోసారి అమెరికా వెళ్తానని చెబుతోంది ఇల్లీ బేబీ. తల్లి, సోదరుడు, సోదరితో కలిసి క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటానని చెబుతోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రణదీప్ హుడాతో ఓ హిందీ సినిమా చేస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నామని, సెట్స్ లో ఉన్నప్పుడు తన పుట్టినరోజుతో పాటు దీపావళి వేడుక వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయానని చెబుతోంది ఈ గోవా బ్యూటీ.

Related Stories