
గ్రాఫిక్స్ పెట్టి హడావిడి చేసేస్తే లేదా భారీ ఫైట్స్ పెట్టి సినిమా తీస్తే అది పాన్ ఇండియా చిత్రం అయిపోతుంది అనే భ్రమలో ఉన్నారు కొందరు దర్శక, నిర్మాతలు. ముఖ్యంగా కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ ధోరణి కనిపిస్తోంది. కానీ ఇటీవల చాలా సినిమాలు పాన్ ఇండియా అంటూ రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నాయి.
పలువురు స్టార్స్ పరువు తీసుకున్నారు.
ఆ జాబితాలో చేరిన మరో పాన్ ఇండియా తెలుగు చిత్రం… ‘శాకుంతలం’. గుణశేఖర్ ని గుడ్డిగా నమ్మి సమంత, దిల్ రాజు చాలా హడావిడి చేశారు. ఇలాంటి మైతాలాజికల్ సినిమాలకు కళ్ళు చెదిరే దృశ్యాలు కీలకం. కానీ ఆకట్టుకునేవేవి ఇందులో లేవు. 3D గ్రాఫిక్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ జీరో. గొప్ప ప్రేమకథ అని చెప్పి తీస్తే ఇందులో లవ్వే కనిపించలేదు.
గుణశేఖర్ నేరేషన్ పాతకాలం టీవీ డ్రామాలా సాగింది. ఇన్ని లోపాలు పెట్టుకొని కూడా పాన్ ఇండియా లెవల్లో ఆడుతుందని దిల్ రాజు, సమంత ఎలా నమ్మారో.