
“వేదం” సినిమాలో నటించిన లేఖ వాషింగ్టన్ గుర్తుందా? ఆమెది అందులో చిన్న పాత్రే. కానీ గ్లామర్ తో ఆకట్టుకొంది. ఆ తర్వాత మంచు విష్ణు నటించిన “డైనమైట్” సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో కనిపించింది. ఎక్కువగా తమిళ చిత్రాలు చేసిన ఈ చెన్నై బ్యూటీ పేరు ఇప్పుడు బాలీవుడ్లో మార్మోగుతోంది.
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ పెళ్లి పెటాకులు అయింది. ఇమ్రాన్ నుంచి విడాకులు తీసుకొంది ఆయన భార్య అవంతిక. ఇది జరిగి ఏడాది కావొస్తోంది. ఐతే వీరు విడిపోవడానికి కారణం లేఖ వాషింగ్టన్ అని ఇప్పుడు తెలుస్తోంది. లేఖకు ఆల్రెడీ పెళ్లి అయింది. ఆమె భర్త ఇమ్రాన్ ఖాన్ కి స్నేహితుడు. అలా పరిచయం పెరిగి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందట. విషయం తెలిసి అవంతిక విడిపోయింది.
లేఖ కూడా భర్త నుంచి విడాకులు తీసుకొని ఇమ్రాన్ ఖాన్ తో సెటిల్ అవుతుందని బాలీవుడ్ పత్రికల మాట.