పండగ చేసుకుంటున్న కియరా

ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. కానీ ఈ ఏడాది కియరా నటించిన 2 సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. సిల్వర్ స్క్రీన్ ను మిస్సయ్యాయి. పైకి నవ్వుతూ కనిపించినా, థియేటర్లను మిస్ అయిన బాధ కియరాకు ఉండనే ఉంది. ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

ఆమె నటించిన ”ఇందూకీ జవానీ” సినిమా థియేటర్లలోకి రాబోతోంది. వచ్చేనెల 11న ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీంతో కియరా ఆనందానికి అవధుల్లేవ్.

రీసెంట్ గా ఆమె నటించిన ”లక్ష్మి”, ”గిల్టీ” సినిమాలు రెండూ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఆమెకు ఓటీటీ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ తెచ్చిపెట్టాయి. ఒక దశలో ”ఇందూకీ జవానీ” సినిమాను కూడా ఓటీటీకి ఇచ్చేస్తారనే ప్రచారం జరిగింది.

ఎట్టకేలకు ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించడంతో కియరా ఊపిరి పీల్చుకుంది. త్వరలోనే కియరా అందాల్ని ప్రేక్షకులు వెండితెర నిండుగా చూడబోతున్నారు.

Related Stories