రవితేజ సినిమాకి క్లాసిక్ టైటిల్?

Ravi Teja

”క్రాక్” సినిమా రిలీజ్ అయింది. ”ఖిలాడీ” సినిమా ప్రొడక్షన్ లో ఉంది. ఇంతలోనే మరో సినిమా రెడీ చేస్తున్నాడు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ కామెడీ-థ్రిల్లర్ చేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీకి ఒక సూపర్ హిట్ క్లాసిక్ టైటిల్ ఫిక్స్ అయ్యేలా ఉంది.

చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్’ సినిమా తరహాలోనే ఈ మూవీ కూడా కామెడీ-థ్రిల్లర్ జానర్ లో రాబోతోంది. బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు.

More

Related Stories