డిప్రెషన్లో బడా హీరో కూతురు

Ira Khan

ఈ బాలీవుడ్ కి ఏమైంది? అందరూ డిప్రెషన్లో ఉన్నామంటున్నారు. దీపికా పదుకొను ఇదే మాట చెప్పింది. చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా డిప్రెషన్ కి గురయ్యాడట. ఇప్పుడు బడా హీరో కూతురు అదే మాట అంటోంది. అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ … గత నాలుగేళ్లుగా డిప్రెషన్లో ఉందట. డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయించుకుందట.

ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రాంలో రాసుకొంది. కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఏమి కావాలంటే అవి తెచ్చిపెట్టే తండ్రి ఉన్నాడు. అందం ఉంది. ఏది కావాలన్నా అది చేసుకునే ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అయినా… ఆమె డిప్రెషన్ కి గురి అయిందట. మెంటల్ హెల్త్ గురించి అందరూ పట్టించుకోవాలని చెప్తోంది.

ఆమె ఇటీవలే డైరెక్టర్ గా కూడా మారింది. అమీర్ ఖాన్ కి మొదటి భార్య రీనాతో ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురే ఇరా.

Related Stories