అక్షయ్ కుమార్ మగ కంగననా?

హీరో అక్షయ్ కుమార్ నటించిన “సెల్ఫీ” దారుణంగా పరాజయం పాలైంది. ఈ సినిమా మొదటి రోజు కేవలం రెండు కోట్ల రూపాయల వసూళ్లే సాధించడంతో ట్రోలర్స్ బిజీ అయిపోయారు. అక్షయ్ కుమార్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

హీరో అక్షయ్ కుమార్ సినిమాకి 100 నుంచి 150 కోట్ల పారితోషికం తీసుకుంటాడు. కానీ వచ్చే ఓపెనింగ్ మాత్రం రెండు కోట్లా? అని ట్రోలర్స్ అక్షయ్ ని ఆడుకుంటున్నారు. మరికొందరు అతన్ని మగ కంగన అంటూ ట్రోల్ చేస్తున్నారు.

హీరోయిన్ కంగన రనౌత్, అక్షయ్ కుమార్…ఇద్దరూ బీజేపీ అనుకూల నటులే. ప్రధాని మోదీకి భజన చేస్తుంటారు. అయినా కూడా కంగన సినిమాలు ఏవీ ఆడడం లేదు.

బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షాబంధన్, పృథ్వీరాజ్, రామ్ సేతు, సెల్ఫీ… ఇలా వరుసగా అరడజను ఫ్లాపులు వచ్చాయి. ఇవన్నీ థియేటర్లలోనే విడుదలయ్య్యాయి. ఒక్క దానికి సరైన ఓపెనింగ్ రాలేదు. అలాగే, కంగన నటించిన 10 సినిమాలు ఢమాల్ అన్నాయి. అందుకే, అక్షయ్ కుమార్ ని కంగన రనౌత్ తో పోలుస్తున్నారు. అతను మగ కంగనా అంటూ ట్రోలింగ్ మొదలైంది.

అక్షయ్ ని ట్రోల్ చెయ్యటానికి కూడా నా పేరే కావాల్సి వచ్చిందా అంటూ కంగనా ట్విట్టర్ లో ఈసడించుకొంది.

 

More

Related Stories