రత్నం కూడా రాజకీయాల వైపు?

ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం కూడా రాజకీయాల వైపు చూపు వేస్తున్నారా? రత్నం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక భారీ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయింది. అలాగే, పవన్ కళ్యాణ్ పొలిటికల్ సమావేశాలకు కూడా రత్నం హాజరవుతున్నారు.

జనసేన పార్టీ గోదావరి జిల్లాల సమన్వయ కమిటీ సభ్యులు డా.యిర్రింకి సూర్యారావు పవన్ కళ్యాణ్ ని బుధవారం హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రత్నం కూడా పాల్గొనడం విశేషం. మరి రత్నం జనసేనలో సభ్యత్వం తీసుకుంటారా? ఆయన బంధువులు బీజేపీలో ఉన్నారు. మరి అటువైపు వెళ్తారా?

షూటింగ్ ఉన్నా లేకున్నా.. రత్నం రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ తో చాటింగ్ వేస్తారు. బహుశా ఇది రెగ్యులర్ గా జరిగే మీటింగ్ అనుకోవాలా?

More

Related Stories