యాజిటీజ్ గానే ఉందిగా!

‘అఖండ’ వంటి సంచలన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ తాజగా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా పేరు ఖరారు కాలేదు. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని NBK107 (అంటే బాలకృష్ణ 107వ చిత్రం)గా పరిగణిస్తున్నారు. ఈ NBK107 సినిమా నుంచి బాలయ్య మొదటి లుక్ విడుదలైంది.

Advertisement

ఈ మొదటి లుక్ చూస్తే… ఇది అచ్చంగా 2017లో విడుదలైన “ముఫ్తి” అనే కన్నడ సినిమా పోలికలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ ఇలాగే నల్లటి షర్ట్, డార్క్ లుంగీ (పంచె) కట్టుకొని కనిపిస్తారు. ఆ సినిమా మొదటి లుక్ లో కూడా శివరాజ్ కుమార్ నడుస్తున్న స్టిల్ నే విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇప్పుడు అదే టాక్.

ALSO READ: NBK107: Balakrishna’s first look is out

ఐతే, ఇది పూర్తిగా స్ట్రెయిట్ తెలుగు చిత్రమే అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఏ చిత్రానికి ఇది రీమేక్ కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.

బాలకృష్ణ గెటప్ కి, శివరాజ్ కుమార్ గెటప్ కి సంబంధం లేదంటున్నారు.

Advertisement
 

More

Related Stories