జాక్వెలిన్ అరెస్ట్ తప్పదా?


జాక్వెలిన్ ఫెర్నెండెజ్ మెడకి ఆమె మాజీ ప్రియుడి కేసు గట్టిగా చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జాక్వెలిన్ ని ఈ కేసులో రెండు సార్లు విచారించారు. తాజాగా ఈ రోజు కూడా ఢిల్లీ పోలీసులు ఆమెని విచారిస్తున్నారు. మూడు సార్లు విచారణకి పిలవడంతో కేసు మరింత బలపడింది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే కేసులో మరో హీరోయిన్ నోరా ఫతేహిని కూడా రీసెంట్ గా విచారించారు ఢిల్లీ పోలీసులు. ఆమె చెప్పిన సమాధానాలు, జాక్వెలిన్ చెప్తున్న విషయాలకి పొంతన ఉండడం లేదట. అందుకే, మళ్ళీ విచారిస్తున్నారు.

మరోవైపు, ఈ కేసులో జాక్వెలిన్ అరెస్ట్ అవుతుంది అని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

200 కోట్ల రూపాయల కుంభకోణంలో సుఖేష్ చంద్రశేఖర్ ఇరుక్కున్నాడు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ కేసులో విచారణ భాగంగా జాక్వెలిన్ ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆమె కొన్నాళ్ళు సుఖేష్ తో ప్రేమాయణం నడిపింది. ఆ టైంలో జాక్వెలిన్ కి సుఖేష్ కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులు ఇచ్చాడట.

 

More

Related Stories