ఇదంతా పబ్లిసిటీ కోసమేనా?

Madhavi Latha

రీసెంట్ గా జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది మాజీ హీరోయిన్, తాజా పొలిటీషియన్ మాధవీలత. ఎన్నడూ లేని విధంగా గడిచిన 10 రోజులుగా ఆమె న్యూస్ ఛానెల్స్ కు కూడా కావాల్సిన వ్యక్తిగా మారింది. అయితే ఇదంతా ఆమె ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా ఎందుకు చేస్తోంది?

కొన్ని రోజుల కిందట టాలీవుడ్ లో డ్రగ్స్ దందా అంటూ సంచలన ఆరోపణలు చేసింది మాధవీలత. తర్వాత అదే టాపిక్ మీద న్యూస్ ఛానెల్స్ అన్నింటికీ ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాజాగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ పెద్ద ఓపెన్ లెటర్ రాసింది.

ఇవన్నీ ఆమె ఎందుకు చేస్తోందనే ప్రశ్నలకు ఒకటే సమాధానం. చాన్నాళ్ల తర్వాత ఆమె ముఖానికి రంగేసుకుంది. మోనో యాక్షన్ తో “లేడీ” అనే సినిమా చేసింది. తనపై పబ్లిసిటీ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే ఆ ట్రయిలర్ రిలీజ్ చేసింది. ఇదే ఊపులో ఆమె ఆ సినిమాను రేపోమాపో ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తుంది.

పబ్లిసిటీలో రెండు రకాలు. ఒకటి తమ సినిమా చూడండి అంటూ చెప్పుకునే పబ్లిసిటీ. రెండోది ఏదో ఒక వివాదం రేపి జనాల్ని తమవైపు తిప్పుకునేలా చేసే పబ్లిసిటీ. తన సినిమా కోసం మాధవీలత ఈ రెండో పద్ధతి ఫాలో అవుతోందంటున్నారు చాలామంది.

Related Stories