చిరంజీవిపై మళ్ళీ పుకార్లు మొదలు

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా కాలమే అయింది. ఆయన సోదరులు (పవన్ కళ్యాణ్, నాగబాబు) రాజకీయాల్లో ఉన్నా… చిరంజీవి మాత్రం ఇక చాలు అనుకోని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయారు.

ఐతే, ఇటీవల చిరంజీవికి కేంద్రప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. చిరంజీవి గత కొంతకాలంగా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలకు మెగాస్టార్ హాజరవుతున్నారు.

దాంతో, చిరంజీవి బీజేపీ గూటిలోకి వెళ్లిపోయారు అనే మాట వినిపిస్తోంది.

మెగాస్టార్ కి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఐతే, చిరంజీవి టీం మాత్రం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతోంది. ఆయన సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిందే రాజకీయాలకు స్వస్తి పలకాలి అనే ఉద్దేశంతో అని మెగాస్టార్ టీం అంటోంది.

Advertisement
 

More

Related Stories