ఈ సీత డిప్రెషన్ లో ఉందా?

- Advertisement -


మృణాల్ ఠాకూర్ అనగానే తెలుగు వాళ్లకు గుర్తొచ్చే సినిమా… సీతారామం. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ ఉరఫ్ సీతగా అదరగొట్టింది. ఈ అందాల భామ తెలుగులో మరింతగా బిజీ కానుంది. తాజాగా నాని 30వ చిత్రాన్ని సైన్ చేసింది.

బాలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు ఉన్నాయి. లస్ట్ స్టోరీస్ 2, పూజ మేరీ జాన్, గుమ్రాహ్ వంటివి ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అంటే కెరియర్ పరంగా ఆమెకి ఢోకా లేదు. బాగానే సంపాదిస్తోంది. ఐతే, తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ తో ఆమె అభిమానులు కంగారు పడ్డారు.

ఆ పోస్ట్ చూస్తే ఆమె డిప్రెషన్ లో ఉంది అనిపించింది. దీపిక పదుకోన్ వంటి పేరొందిన హీరోయిన్లు కూడా ఇటీవల తాము డిప్రెషన్ తో బాధపడినట్లు చెప్పారు. సక్సెస్ ఉన్నవారు కూడా ఎందుకో డిప్రెషన్ కి గురవుతున్నారు. మృణాల్ కూడా అదే సమస్యతో బాధపడుతుందా అని జర్నలిస్టులు, అభిమానుల నుంచి ఆమెకి ఎంక్వయిరీలు మొదలయ్యాయి. దాంతో, ఆమె వివరణ ఇచ్చింది.

“నేను బాగున్నాను. ఎటువంటి మానసిక సమస్యలు లేవు. కొన్ని కొన్ని సార్లు మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని ఇతరులతో షేర్ చేసుకోవాలి. బయటపెట్టుకోవాలి. అప్పుడే మనసు తేలిక అవుతుంది. అందుకే అలాంటి పోస్ట్ పెట్టాను. అంతకుమించి ఏమి లేదు,”అన్నట్లుగా సమాధానం ఇచ్చింది ‘సీతారామం’ సుందరి.

 

More

Related Stories