నిజంగా వెయ్యి కోట్ల ఫిగరా?

Malli Pelli

నరేష్, పవిత్ర లోకేష్ కలిసే ఉంటున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే… ఇద్దరూ ఒక జంటగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. 60 ఏళ్ల వయసులో నరేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే, ఆయన ఆస్తిని చూసి పవిత్ర లోకేష్ నరేష్ తో బంధం ఏర్పరచుకొని ఉంటుంది అనే వాళ్ళూ ఉన్నారు.

ఇక నరేష్, పవిత్ర కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాలో కూడా ఈ ఆస్తుల ప్రస్తావన ఉంది. నరేష్ గురించి ఒక డైలాగ్ లో ‘వెయ్యి కోట్ల ఫిగర్’ అనే మాట కూడా ఉంది. అంటే నరేష్ కి వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి అని ఆ సినిమాలో చెప్పారు.

మరి నిజంగా నరేష్ అంత ఆస్తిపరుడేనా? అవును. అందులో కొంత నిజం ఉంది. నరేష్ కోటీశ్వరుడు. కానీ ఆయన ఆస్తులు 1000 కోట్లు మాత్రమే కాదు. ఇంకా ఎక్కువ. దాదాపు 2000 కోట్ల ఆస్తి ఉంది నరేష్ కి.

నరేష్ కి వారసత్వంగా చాలా ఆస్తులు వచ్చాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, బెంగళూరు సమీపంలో వందల ఎకరాల భూమి నరేష్ కి ఉంది. అందుకే అతను లైఫ్ నిే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement
 

More

Related Stories