రజినీకాంత్ జైలర్ ‘కాపీ’ కథేనా?

- Advertisement -
Jailer


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “జైలర్” ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూస్తే రజినీకాంత్ సాదాసీదా జీవితాన్ని గడిపే రిటైరైన వ్యక్తి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తి తనతో పెట్టుకున్న వారి భరతం పట్టేందుకు ఎంత దూరమైన వెళ్తాడు. ట్రైలర్, రజినీకాంత్ గెటప్ అదిరింది.

రజినీకాంత్ యాక్టింగ్ స్టయిల్ కూడా కొత్తగా ఉంది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఐతే, ఈ సినిమా ఒక హాలీవుడ్ చిత్రానికి కాపీ అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కరోనా టైంలో విడుదలైన “నోబడి” (Nobody) అనే చిత్ర కథకు, ఈ సినిమాకి దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ ని బట్టి ఇది “Nobody” చిత్రానికి కాపీ అని నెటిజన్లు అంటున్నారు.

ఐతే, సినిమా విడుదల తర్వాతే ఇది కాపీనా లేక ఒరిజినల్ స్టోరీనా అన్నది తేలుతుంది. ఇప్పుడే దీన్ని కాపీ అనడం సమంజసం కాదు.

 

More

Related Stories