ప్రభాస్ సరసన నటించనుందా?

Rashmika

కొత్త కొత్త కాంబినేషన్ లు సెట్ చెయ్యడంలో తెలుగు మీడియా, సోషల్ మీడియా ముందు ఉంటుంది. అలాంటి ఒకకలయికని ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చింది. అదే ప్రభాస్ – రష్మిక కాంబినేషన్.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తీయబోతున్న విషయం కొత్తదేమీ కాదు. ప్రభాస్ – సందీప్ కాంబినేషన్ లో “స్పిరిట్” అనే చిత్రం ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. “యానిమల్” సినిమా విడుదల తరువాత ఈ సినిమాకి మరింతగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో రష్మిక నటించనుంది అని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు.

కానీ, ఇప్పటివరకు హీరోయిన్ గురించి ఆలోచించలేదు సందీప్. ఎందుకంటే, “స్పిరిట్” సినిమాకి ఒక స్టోరీ లైన్ అనుకున్నప్పటికీ దాన్ని పూర్తి స్క్రిప్ట్ గా ఇంకా మలచలేదు ఆ దర్శకుడు. మరో ఐదారు నెలలు పడుతుంది మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యేసరికి. ఇక రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ షురూ అవుతుంది.

అప్పుడు డేట్స్ అందుబాటులో ఉండే హీరోయిన్ ని చూస్తారు సందీప్. “యానిమల్” సినిమాలో ఆమె నటించింది కాబట్టి ఆమెని తీసుకుంటారు అని అభిమానులు అనుకుంటున్నారు కానీ సందీప్ అలాంటి లెక్కలు వెయ్యరు.

Spirit

“స్పిరిట్” సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ అధికారిగా నటిస్తారు. ఆయన సరసన ఎవరు నటిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం. రష్మిక నటించొచ్చు, లేకపోవచ్చు. ప్రస్తుతం ఐతే ఆమె పేరుని పరిశీలించలేదు అని టీం చెప్తోంది. ఆ మాటకొస్తే ఏ హీరోయిన్ ని ఇప్పటివరకు అనుకోలేదట.

Advertisement
 

More

Related Stories