హవ్వ సల్మాన్ తో లవ్వా!

Pooja Hegde


పూజ హెగ్డే తెలుగులో, తమిళ్ లో పెద్ద పెద్ద హీరోల సరసన నటించింది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలతో రొమాన్స్ చేసింది వెండితెరపై. అలాగే నాగ చైతన్య, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువ హీరోలతోనూ ఆడిపాడింది. కానీ, ఆమె ఫలానా హీరోతో లవ్ లో ఉందనో, డేటింగ్ చేస్తుందనే పుకార్లు రాలేదు.

కానీ, ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో సడెన్ గా డేటింగ్ పుకార్లు ఎదుర్కొంటోంది. సల్మాన్ ఖాన్ తో రీసెంట్ గా డేటింగ్ షురూ చేసింది అని బాలీవుడ్ మీడియా సడెన్ గా కోడై కూస్తోంది. రెండు రోజులుగా అన్ని చోట్లా అవే వార్తలు.

సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే మొదటి సారిగా కలిసి నటించారు. “కిసి కా భాయ్ కిసి కీ జాన్” అనే చిత్రంలో వీరిద్దరిది ఒక జోడి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. షూటింగ్ పూర్తి అయ్యాక వీరి డేటింగ్ గురించి పుకార్లు మొదలయ్యాయి.

పైగా సల్మాన్ ఖాన్ ఐశ్వర్య, కత్రిన, జాక్వెలిన్… ఇలా పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేశారు. అన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఐతే, పూజ హెగ్డేతో నిజంగా రిలేషన్ షిప్ ఉందా లేక “కిసి కా భాయ్ కిసి కీ జాన్”కి పబ్లిసిటీ కోసం ఈ పుకారు లేపారా అన్నది చూడాలి.

 

More

Related Stories