గరం గరం సీన్లలో సమంత?

Samantha


సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. హిందీలో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరో. వీరి ఇద్దరి మధ్య గరం గరం సీన్లు ఉన్నాయనే టాక్ నడుస్తోంది.

ఈ ప్రచారం జరగడానికి ఒక కారణం ఉంది. ‘సిటాడెల్’ ఇంగ్లీష్ వర్షన్ ఇప్పటికే విడుదల అయింది. అందులో రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. ఇద్దరి మధ్య కిస్ సీన్లతో పాటు, బెడ్ రూమ్ సన్నివేశాలు ఉన్నాయట. అదే కథతో హిందీలో తీస్తున్నప్పుడు అలాంటి సన్నివేశాలు ఇక్కడ కూడా ఉండాలి కదా. ఆ ఉద్దేశంతోనే సమంత గరం గరం సీన్లలో కనిపించనుంది అనే ప్రచారం మొదలైంది.

ఐతే, సమంత మాత్రం తమ ‘సిటాడెల్’ ప్రియాంక చోప్రా నటించిన వర్షన్ కి రీమేక్ కాదు అని చెప్తున్నారు. అదే కాన్సెప్ట్ తో ఇండియాలో సాగే విభిన్న కథ. పేరు, కాన్సెప్ట్ సేమ్ కానీ కథ, కథనాలు వేరు అనేది సమంత అభిప్రాయం. ముద్దు సీన్ల వరకు సమంత అభ్యంతరం చెప్పకపోవచ్చు కానీ శృంగార సన్నివేశాల్లో నటిస్తుందా అనేది చూడాలి.

సమంత డేరింగ్ నటి. ఎలాంటి పాత్రలు అయినా చేస్తారు. ఐటెం సాంగ్ లో కూడా మెప్పించారు. కాబట్టి ఆమె గరం గరం సీన్లలో కూడా ఈస్తటిక్ గా తీస్తే ఒప్పుకోవచ్చు. ఐతే, అసలు విషయం ఏంటనేది తెలియాలి అంటే మరికొంతకాలం ఆగాలి.

Kushi

ఈ వెబ్ సిరీస్ తో పాటు సమంత ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు ఇందులో. ఐతే, ఇందులో ప్యూర్ రొమాన్స్ తప్ప హాట్ హాట్ సీన్లు వంటివి ఉండవు.

Advertisement
 

More

Related Stories