
“సలార్” సినిమా హిట్ అయింది. ఆ సినిమాలో నటించిన శృతి హాసన్ తన తదుపరి తెలుగు చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. గతేడాది నాలుగు సినిమాల్లో కనిపించిన ఈ భామ 2024లో ఇంకా ఒక్క మూవీ కూడా సైన్ చెయ్యలేదు.
దాంతో, ఆమెకి “సలార్” వల్ల పెద్దగా ఉపయోగం కలగలేదు అనే అభిప్రాయం ఏర్పడింది. ఐతే, అది నిజం కాదని చెప్పొచ్చు.
నిజానికి బాలకృష్ణ తాజా చిత్రం (#NBK109)లో ఆమెని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె ఆసక్తి చూపలేదు. బాలయ్య సరసన ఇప్పటికే “వీర సింహా రెడ్డి” చిత్రంలో నటించింది. తక్కువ గ్యాప్లో ఆయన సరసన నటించేందుకు ఆమె ఇంటర్సెట్ గా లేదని టాక్. దాంతో మేకర్స్ ఆ ఆలోచనని విరమించుకున్నారు. అలాగే, నాగార్జునతో తీయబోయే “బంగర్రాజు 2″లో కూడా ఆమె పేరు వినిపిస్తోంది.
అంటే ఆమెకి ఆఫర్లు వస్తున్న మాట నిజమే కానీ ఏవీ ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. అలాగని, ఆమెకి తెగ ఆఫర్లు కూడా రావడం లేదు. ఆమె ముఖంలో మునుపటి మెరుపు లేదు అనేది నిజం. అందుకే, యువ హీరోలు ఆమెతో నటించేందుకు ఆసక్తి చూపట్లేదు. ఆమెకి ఎక్కువగా సీనియర్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి.

ఐతే, ఈ ఏడాది ఆమె “సలార్ 2″లో నటించాల్సి ఉంటుంది. ప్రభాస్, శృతి హీరోహీరోయిన్లుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్ 2” త్వరలో మొదలుపెట్టనున్నారు.