- Advertisement -

సీరత్ కపూర్ పలు సినిమాల్లో నటించింది కానీ క్రేజ్ తెచ్చుకోలేదు. ఇటీవల యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన వరుసగా రెండు సినిమాలు చేసింది. దాంతో వీరి మధ్య “మంచి ఫ్రెండ్సిప్” డెవలప్ అయింది. ఇప్పుడు ఆమె కెరీర్ కి బూస్టప్ వచ్చేలా సిద్ధూ ప్రయత్నిస్తున్నాడట.
“కృష్ణ అండ్ హిజ్ లీల” ఓటిటి వేదికపై విడుదలయింది. యూత్ కి నచ్చింది. దాంతో ఓటిటి సంస్థలు సిద్ధుతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నాయి. తన కెరీర్ కుదురుకోవడంతో… సిద్దూ ఇప్పుడు తన “ఫ్రెండ్” సీరత్ ని తనకి తెలిసిన దర్శకులకు, నిర్మాతలకు సిఫార్స్ చేస్తున్నాడట.
“రన్ రాజా రన్” సినిమాతో తెలుగులోకి ఇంట్రడ్యూస్ అయిన ఈ భామ ఇప్పటివరకు యాక్టింగ్ సరిగా నేర్చుకోలేదు. అందాల ప్రదర్శన, ముద్దు సీన్లతో ఆకట్టుకుంటోంది.