“యానిమల్” సినిమా సంచలనం సృష్టించింది. అందరి అంచనాలు మించి భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో రణబీర్ కపూర్ మాస్ హీరోగా మారారు. ఇక రష్మిక మందానకి బాలీవుడ్ లో మొదటి విజయం దక్కింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు దేశంలో అగ్ర దర్శకుల్లో ఒక్కరు.
ఐతే, వీళ్లందరి కన్నా ఎక్కువ అటెన్సన్ పొందిన భామ మాత్రం తృప్తి డిమ్రి. ఈ సినిమాలో ఆమె రెండో హీరోయిన్ గా నటించింది. సినిమాలో కొద్దిసేపే ఉంటుంది. కానీ ఆమె అందాలు, ఆమె అప్పీల్ అదిరిపోయాయి. బాలీవుడ్ మీడియా, సోషల్ మీడియా అంతా ఆమె గురించే మాట్లాడింది.
ఐతే ఆమెకి అంత పేరు, పబ్లిసిటీ రావడం కరెక్ట్ కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు సందీప్ వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్.
“తృప్తి డిమ్రి బాగా చేసింది. ఆమె టాలెంటెడ్. కానీ హీరోయిన్ రష్మికని పక్కన పెట్టి అందరూ ఆమె గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. హీరో రణబీర్ కపూర్ తర్వాత మంచి పాత్రలో అద్భుతంగా చేసింది రష్మిక. ఆమె గురించి ఎక్కువ మాట్లాడాల్సింది. రష్మిక గురించి ఒక్క ముక్క రాయకుండా మొత్తంగా తృప్తి గురించే పబ్లిసిటీ చేయడం తప్పు,” అని ప్రణయ్ అంటున్నారు.
మీడియా తృప్తి మీద ఫోకస్ పెట్టడం కారణంగా రష్మికకి రావాల్సినంత పేరు రాకుండా మరుగున పడింది అనేది అతని అభిప్రాయం.