గ్యాప్ ఇచ్చా.. మళ్లీ వస్తా

isha chawla long

వకాశాలు రాక తను సినిమాలు తగ్గించలేదంటోంది హీరోయిన్ ఇషా చావ్లా. కావాలనే కెరీర్ లో చిన్న గ్యాప్ ఇచ్చానని, అంతలోనే కరోనా కూడా వచ్చిందని కవర్ చేస్తోంది. త్వరలోనే మరికొన్ని సినిమాలతో ఆడియన్స్ ను పలకరిస్తానంటోంది.

“కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమై అమెరికాలో ఉండటం వల్ల కొత్త సినిమాలు ఓకే చేయలేదు. నేను సినీ పరిశ్రమ కు దూరమైనా నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సీరిస్ లో చేస్తున్నా. కరోనా వల్ల అది ఆలస్యం అవుతోంది. తెలుగులో రెండు , తమిళ్ లో రెండు చిత్రాలు ఫైనల్ అయ్యాయి.”

ఇలా తన లైనప్ బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ, తనకు హీరోయిన్ గా జన్మనిచ్చిన టాలీవుడ్ ను వదిలేది లేదంటున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేస్తానంటోంది.

రీసెంట్ గా ఆర్పీ పట్నాయక్ తో కలిసి లైవ్ షోలు చేసిందట ఇషా చావ్లా. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిందని, మరీ ముఖ్యంగా శ్రీలంకలో చేసిన షో బాగా హిట్టయిందని చెబుతోంది. “ప్రేమకావాలి” సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ, 2016లో వచ్చిన “రంభ ఊర్వశి మేనక” అనే సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు

Related Stories