
టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు మళ్ళీ కరోనా బారిన పడుతున్నారు. మొదటి వేవ్ లో తక్కువమంది సెలెబ్రిటీలు కరోనాతో ఇబ్బందిపడ్డారు. రెండో వేవ్ లో మాత్రం ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి లెజెండ్స్ ని కోల్పోయాం కరోనాకి. రెండో వేవ్ తెలుగుసినిమా రంగాన్ని అతలాకుతలం చేసింది. మళ్ళీ ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి.
‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా కూడా కరోనా బాధితురాలే. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంది ఈ భామ.
‘శ్రీమన్నారాయణ’, ‘పూలరంగడు’, ‘Mr పెళ్ళికొడుకు’, ‘జంప్ జిలాని’ వంటి చిత్రాలలో నటించిన ఇషా చావ్లా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో రూపొందుతోన్న “దివ్య దృష్టి” అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది.
ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.