23న రిస్క్ లేదంటున్న ‘ఇష్క్’

అన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కి భయపడేది లేదంటున్నాడు యంగ్ హీరో తేజ స‌జ్జా. ఈ ఏడాది ‘జాంబీ రెడ్డి’తో విజయం అందుకున్న తేజ ఇప్పుడు ‘ఇష్క్’ అనే సినిమాతో మనముందుకొస్తున్నాడు.

మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత తేజ స‌జ్జాతో ‘ఇష్క్‌` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.

నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ విడుదల వాయిదా పడింది. దాంతో ఆ డేట్ ని ఈ టీం లాక్ చేసుకొంది.

More

Related Stories