‘అవును నా లక్ తిరిగింది’

'అవును నా లక్ తిరిగింది'

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫిక్స్ అయింది అని తెలుగుసినిమా. కామ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ళూ మౌనం వహించిన నిధి ఈ సినిమా గురించి ఇప్పుడు మౌనం వీడింది. “ఇది నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్. నా కెరీర్లోనే ఇది గోల్డెన్ సినిమా,” అంటూ ఆనందంగా ఇంటర్వ్యూలిస్తోంది.

లాస్ట్ ఇయరే పవన్ కళ్యాణ్ సరసన కొద్ధి రోజులు షూటింగ్లో పాల్గొంది నిధి అగర్వాల్. ఐతే, లాక్డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ గ్యాప్ లో ఆ ప్రాజెక్ట్ పై అనేక రూమర్స్ వచ్చాయి. సినిమా మొత్తానికే పక్కన పెట్టేశారని అన్నారు. దాంతో ఈ భామ సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఈ సంక్రాంతి టైంలో షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్, నిధిపై ఒక పాట కూడా తీశారు. ఇప్పుడు ఈ సినిమా గురించి అందరికి క్లారిటీ వచ్చింది. ఆమెకి కూడా నమ్మకం కుదిరింది. అందుకే ఇప్పుడు టామ్ టామ్ చేసుకుంటోంది.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఆమెకి ఫస్ట్ హిట్ దక్కింది. ఐతే, పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ రావడంతో ఆమె నెక్స్ట్ లెవల్ కి వెళ్ళినట్లే. అందుకే అంత ఆనందంగా ఉంది.

'అవును నా లక్ తిరిగింది'

ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఐతే, ‘హర హర మహాదేవ్’, ‘వీరమల్లు’ అనే రెండు పేర్లు పరిశీలిస్తున్నారని టాక్.

More

Related Stories