జానీ మాస్టర్ హీరోగా మూవీ షురూ

Jaani and Digangana

‘అల వైకుంఠపురంలో’ బుట్ట బొమ్మ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. గత పదేళ్లలో ఎన్నో సినిమాలకు డాన్స్ స్టెప్పులు అందిచ్చాడు. ఆయన హీరోగా, హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా ఒక సినిమా ప్రారంభం అయింది.

మురళిరాజ్ తియ్యాన అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి హీరోగా చేసేందుకు ఒప్పుకున్నాడట. కే వెంకటరమణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ వేడుకకు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు నాగబాబు, యాంకర్ ప్రదీప్ హాజరయ్యారు.

డాన్స్ మాస్టర్లుగా పాపులర్ అయి, ఆ తర్వాత హీరోలుగా మారిన వారి జాబితా చిన్నదేమీ కాదు. ప్రభుదేవా, లారెన్స్ ల సక్సెస్ చూశాం కదా. మరి జానీ మాస్టర్ వీరిలా హీరోగా పాపులర్ అవుతాడా?

More

Related Stories