ఇది ఓటీటీలోకి ఎందుకు రాలేదబ్బా!

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా ఇబ్బంది పడింది ఎవరంటే చిన్న సినిమాలు, చిన్న సినిమాలే. రెడీ అయిన సినిమాని దాచుకోలేక, అలా అని వడ్డీల మీద వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే మీడియం రేంజ్, భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలు తొందరగా ఓటీటీలోకి వచ్చేశాయి. అలా ఉన్నంతలో ఆర్థిక కష్టాల నుంచి ఈ సినిమాలన్నీ బయటపడ్డాయి. మరి చిన్న సినిమాగా తెరకెక్కిన “జాతిరత్నాలు” అనే మూవీ ఏమైంది.

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి నటులు కలిసి చేసిన సినిమా ఇది.

స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ పడ్డంతో విడుదల వాయిదా పడింది. తన సినిమాకు ఇలాంటి గతి పట్టిందేంటి దేవుడా అంటూ నవీన్ పొలిశెట్టి కొన్ని ఫన్నీ వీడియోలు కూడా చేశాడు.

మరి ఈ సినిమా ఎందుకు ఓటీటీలోకి రాలేదు. మేకర్స్ తలుచుకుంటే ఈ మూవీని కూడా ఓటీటీకి ఇచ్చేయొచ్చు. బిగ్ బడ్జెట్ మూవీ కాదు, పైగా స్టార్స్ కూడా లేరు, కొత్త దర్శకుడి సినిమా.. కాబట్టి ఓటీటీకి ఇచ్చి చేతులు దులిపేసుకోవచ్చు. కానీ ఆ అవసరం మేకర్స్ కు రాలేదు. ఎఁదుకంటే ఈ సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చయిందో దాదాపు అంత మొత్తం శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చేసింది. జెమినీ టీవీ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. ఇక అలాంటప్పుడు ఓటీటీకి ఇవ్వడం ఎందుకు. అందుకే థియేట్రికల్ రిలీజ్ కోసం తాపీగా ఎదురుచూస్తోంది యూనిట్.

Related Stories