నాకు టైం కావాలి: జాక్వెలిన్

- Advertisement -
Jacqueline Stills 010722 004

గత రెండేళ్లలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు పలువురు సినిమా తారలను ప్రశ్నించారు వివిధ కేసుల్లో. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ఈడీ ముందు హాజరయిన వైనం చూశాం. కానీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నెండెజ్ మాత్రం ఈడీ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. విచారణకు రావాల్సిందిగా పిలిస్తే… ఆమె వెళ్లడం లేదు.

ముందే ఒప్పుకున్న షూటింగులు, ఇతర కమిట్మెంట్స్ వల్ల రాలేకపోతున్నాను అంటూ జాక్వెలిన్ ఫెర్నెండెజ్ సమాధానం ఇచ్చింది. వీలు చూసుకొని వస్తాను అంటూ సెలవివ్వడం విశేషం.

మోసగాడు సుఖేష్ కేసులో జాక్వెలిన్ ఫెర్నెండెజ్ సహ నిందితురాలు. సుఖేష్ తో కొంతకాలం ప్రేమాయణం నడిపిన జాక్వెలిన్ అతని దగ్గర్నుంచి కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులు అందుకొంది. ఆ విషయంలోనే ఆమెని విచారణకి పిలిచింది ఈడీ. తాజాగా ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు కూడా ఆమెని విచారణకి పిలిచారు.

జాక్వెలిన్ ఫెర్నెండెజ్ పెద్ద బిజి నటి ఏమి కాదు. కానీ, బాగా ప్రిపేర్ అయి విచారణకు వెళ్లాలని భావిస్తున్నట్లుంది.

More

Related Stories