- Advertisement -

ఆకాష్ పూరి, గెహన సిప్పీ జంటగా రూపొందుతోన్న చిత్రం… “చోర్ బజార్”.
దళం, జార్జ్ రెడ్డి సినిమాలు తీసిన జీవన్ రెడ్డి దీనికి దర్శకుడు. లేటెస్ట్ గా “జడ’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
“అబ్బబ్బా ఇది ఏం పోరి..చూడగానే కళ్లు చెదిరి, కోసేసానమ్మో దాని జడపై మనసు పడి…” అంటూ సాగే ఈ పాటకి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. రామ్ మిర్యాల పాడారు. మిట్టపల్లి సురేందర్ రాశారు. ఈ పాటలో సీనియర్ నాయిక అర్చన, హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ గెహన కనిపిస్తారు.
వీ.ఎస్.రాజు నిర్మించిన “చోర్ బజార్” త్వరలోనే థియేటర్ లలో విడుదల కానుంది.