- Advertisement -

రచయితగా, దర్శకుడిగా పాపులర్ అయిన సంపత్ నంది నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం.. ‘సింబా’. జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.
అడవి నేపథ్యంలో అల్లుకున్న కథతో రూపొందుతోంది ‘సింబా’. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సంపత్‌నంది దీనికి రచయిత, సహ నిర్మాత.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా, అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబు నటిస్తున్నారట. ఆ ఫోటో విడుదల అయింది.
డి.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తోన్న సింబా చిత్రానికి కృష్ణప్రసాద్ సినిమాటోగ్రాఫర్. కొత్త టాలెంట్ మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.