“జై భీం”కి నిరాశే

Jai Bheem


ఒక భారతీయ సినిమా ఆస్కార్ బరిలోకి దిగాలంటే మన దేశం నుంచి అధికారికంగా ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరికి పంపాలి. లేదంటే డైరెక్ట్ గా ఆస్కార్ బరిలో నిలవాలంటే ఆ సినిమాని అమెరికాకి చెందిన ఒక ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ సహ నిర్మాతగా అయినా ఉండాలి. ఇలా కాకుండా ఆస్కార్ బరిలో భారతీయ చిత్రాలు కానీ విదేశీ చిత్రాలు కానీ డైరెక్ట్ గా ఆస్కార్ పోటీకి నామినెట్ కాలేవు.

కానీ మంగళవారం ఉదయం ఒక సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. సూర్య నటించిన “జై భీం” ఆస్కార్ ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేట్ కాబోతోంది అని సోషల్ మీడియాలో హడావిడి జరిగింది. “రాటెన్ టొమోటస్” అనే వెబ్ సైట్ కి చెందిన ఎడిటర్ ఒకరు ఈ లీక్ ఇచ్చారంటూ హంగామా జరిగింది.

మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) ఆస్కార్ నామినేషన్ లు ప్రకటించారు. 10 చిత్రాలను ఉత్తమ చిత్రాలుగా నామినేట్ చేశారు. ఇందులోంచి ఒక చిత్రాన్ని బెస్ట్ మూవీగా వచ్చే నెల ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తారు. ఈ పది చిత్రాల్లో ‘జై భీం’ చోటు దక్కలేదు.

కేవలం ఆ జర్నలిస్ట్ ట్వీట్ వల్ల అందరిలో ఆశలు కలిగాయి. సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేశారు, ఆశలు పెట్టుకున్నారు.

ఐతే, “రైటింగ్ విత్ ఫైర్” అనే డాక్యుమెంటరీ నామినేట్ అయింది. ఈ డాక్యుమెంటరీ భారతదేశానికి చెందిన ఫిలింమేకర్స్ తీసిందే. ఇదొక్కటే మన దేశంతో ఉన్న కనెక్షన్ ఈ సారి ఆస్కార్ అవార్డులలో.

Advertisement
 

More

Related Stories