‘జై హనుమాన్’లో పెద్ద హీరోనే

Hanu Man

“హనుమాన్” విజయం మామూలు విజయం కాదు. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందనుంది. రెండో భాగం పేరు “జై హనుమాన్”. ఐతే, ఇందులో అసలైన ప్రధాన పాత్రని ఒక పెద్ద హీరో పోషించబోతున్నారు.

“హను మాన్” సినిమాలో హీరో తేజ సజ్జ. హనుమంతుడి దైవ బలంతో విజేతగా నిలిచే ఒక కుర్రాడి కథ ఆ సినిమా. ఐతే, హనుమంతుడి పాత్రని కేవలం గ్రాఫిక్స్ ద్వారా చూపించారు. “జై హనుమాన్” సినిమాలో హనుమంతుడు నిజంగానే ప్రత్యక్షం అవుతాడట. అంటే ఆంజనేయుడు పాత్రని పోషించే నటుడు కావాలి. ఎవరో ఒక నటుడు పోషిస్తే కిక్ రాదు. పేరొందిన హీరో కావాలి.

ఒక పెద్ద హీరోతో చర్చలు జరుపుతున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ప్రకటించారు. ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడే చెప్పను అంటున్నారు. మరో రెండు నెలల తర్వాత ఆ విషయాన్ని బయట పెడుతాడట. మరి, ఆ హీరో ఎవరో. అనేది చూడాలి.

ఒక కన్నడ హీరో, ఒక తెలుగు హీరో పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి.

ఐతే సీక్వెల్ లో కూడా తేజ సజ్జ నటిస్తాడట. అతని పాత్ర మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. కాకపోతే ఈ సీక్వెల్ లో అతను హీరో కాదు. “హనుమంతుడే” హీరో.

More

Related Stories