‘జైలర్’ ఊపు మాములుగా లేదుగా!

- Advertisement -
Jailer


ఒకప్పుడు రజినీకాంత్ సినిమా వస్తోందంటే తమిళనాడు ఊగిపోయేది. మన తెలుగునాట కూడా క్రేజ్ బాగా ఉండేది. ఐతే, ఆ మేనియా ఇటీవలి కాలంలో తగ్గిపోయింది. తమిళనాడులో కూడా రజినీకాంత్ సినిమా విడుదల సమయంలో భారీ హంగామా కనిపించడం లేదు. ఇక తెలుగునాట అయితే 10 కోట్లు కూడా రజినీకాంత్ సినిమాలు రాబట్టలేకపోతున్నాయి. అందుకే, రెండు నెలల క్రితం కూడా “జైలర్” సినిమాకి ఎలాంటి ప్రచార హంగామా కనిపించలేదు.

కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఎప్పుడైతే “నువ్వు కావాలయ్యా” అనే పాట వైరల్ అయిందో అప్పుడు ఈ సినిమాకి తమిళనాడులో క్రేజ్ పెరిగింది. తెలుగులో కూడా కొంచెం బజ్ వచ్చింది. ఇక ట్రైలర్ విడుదలయ్యాక మొత్తం సీన్ మారిపోయింది. తమిళ్ వర్షన్ కి ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలకు ఉన్నంత హైప్ ఇప్పుడు వచ్చింది. తెలుగులో కూడా మంచి పాజిటివ్ కోణం పెరిగింది.

ఇక అమెరికాలో ఐతే, ఈ సినిమా భారీ రికార్డులు క్రియెట్ చేసేలా ఉంది. ప్రీమియర్ షోలతోనే “జైలర్” వన్ మిలియన్ డాలర్లు పొందేలా ఉందని అడ్వాన్స్ బుకింగ్ జోరుని బట్టి చెప్పొచ్చు.

ఈ ఏడాది ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కానీ, బాలీవుడ్ మూవీ కానీ, తమిళ సినిమా కానీ ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్లు కొల్లగొట్టలేదు. ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” వంటి పెద్ద సినిమాలకు కూడా సాధ్యం కాలేదు. కానీ, రజినీకాంత్ “జైలర్” మాత్రం అది సాధించేలా ఉంది. అంటే రజినీకాంత్ ఒకప్పటి క్రేజ్ ఇన్నాళ్లకు ఈ సినిమాతో వచ్చింది అన్నమాట. ఐతే, ఈ సినిమా రివ్యూస్ వచ్చిన తర్వాత కానీ దీని అసలు రేంజ్ తేలదు. ప్రస్తుతానికి ఐతే ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టేలా ఉంది.

 

More

Related Stories