
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే హవా. దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది ఆ పార్టీ. దాదాపు 90 శాతం సీట్లలో అధికార పార్టీదే డామినేషన్. ప్రతిపక్ష తెలుగుదేశం ఘోరంగా చతికిలా పడింది. ఆ పార్టీ ఎక్కడా ప్రభావము చూపలేదు.
బీజేపీ-జనసేన మిత్రపక్ష కూటమిలో జనసేనదే పై చేయి అయింది. జనసేన పార్టీ సీట్ల పరంగా పెద్దగా సంపాదించలేదు కానీ అనేక చోట్లా తనకి బలం ఉంది అని ప్రూవ్ చేసుకొంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ హడావిడి చెయ్యడమే తప్ప… కోస్తాంధ్రలో జనసేనకే బలం ఎక్కువ అని ఈ ఎన్నికలు తేల్చాయి. పవన్ కళ్యాణ్ సరి అయిన వ్యూహాలు పన్నడం లేదు కానీ ఆయన పార్టీకి బేస్ అయితే ఉంది.
ఇప్పటి నుంచి అయినా పవన్ కళ్యాణ్ బీజేపీ షాడో నుంచి బయటపడి సోలోగా పార్టీ క్యాడర్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొంటే అధికారంలోకి రాకపోయినా ఒక బలమైన శక్తిగా మారొచ్చు.