తెలంగాణలో జనసేన మొదటి పోటీ

Pawan Kalyan

జనసేన పార్టీ పెట్టి ఇప్పటికే 9 ఏళ్ళు పూర్తి అయ్యాయి. కానీ ఆ పార్టీ ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. మొదటిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తుంది.

బీజేపీతో కలిసి చేతులు కలిపి బరిలోకి దిగుతోంది. బీజేపీ మిత్రపక్షం జనసేన పార్టీకి 8 స్థానాలు కేటాయించింది. ఆ స్థానాలు ఇవే 1) కూకటిపల్లి 2) తాండూరు 3) కోదాడ 4) నాగర్ కర్నూలు 5) ఖమ్మం 6) కొత్తగూడెం 7) వైరా (ఎస్టీ) 8) అశ్వరావు పేట.

పవన్ కళ్యాణ్ ఈ రోజు (నవంబర్ 7) హైదరాబాద్ లో ప్రధాని మోదీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరి ఈ ఎనిమిది మంది అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారా లేదా అన్నది చూడాలి.

మార్చి, ఏప్రిల్ లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుందో చూడాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి నిలబడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్లా నిలబడి ఓడిపోయారు. కానీ ఈసారి ఒకే చోట నిలబడతారు అని అంటున్నారు.

Advertisement
 

More

Related Stories