
జాన్వీ కపూర్ ని తెలుగు చిత్రసీమకి తీసుకురావాలని ఎంతోమంది దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అందెగత్తె, శ్రీదేవి కూతురు…. ఈ రెండూ ఫ్యాక్టర్స్ ఆమెకి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. కానీ ఆమెని ఒప్పించాలన్న ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు ఇప్పటివరకు. విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’లో నటించేందుకు మొదట ఆసక్తి చూపింది. ఆమె గురువు కరణ్ జోహార్ ఆమెని ఒప్పించాడు. ఆల్మోస్ట్ సైన్ చేసే వరకు వచ్చింది. కానీ ఎందుకో చివరి నిమిషంలో తప్పుకొంది జాన్వీ.
జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాకి ఎనిమిది నుంచి పది కోట్లు రూపాయలు తీసుకుంటోంది. తెలుగు సినిమాలు అనేసరికి 2 కోట్లు అదనంగా అడుగుతోంది. పారితోషికం తగ్గించే ప్రసక్తి లేదని చెప్తోంది. అందుకే, కాబోలు ఇప్పుడు తెలుగు నిర్మాతలు ఆ ప్రయత్నాలు మానేశారు.
Also Check: Janhvi Kapoor’s close-up shots
జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో అవకాశాలు కొదువ లేదు.