మాల్దీవుల్లో కిరాకు పుట్టిస్తున్న జాన్వి

- Advertisement -
Janhvi Kapoor

సినిమా హీరో, హీరోయిన్లకు మాల్దీవులు ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ గా మారింది. దాదాపుగా ప్రతివారం ఎవరో ఒక సెలబ్రిటీ మాల్దీవుల్లో దిగడం, అక్కడ హల్చల్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆనందం కలిగిస్తున్నారు. లేటెస్ట్ గా కిరాకు పుట్టిస్తున్న భామ.. జాన్వీ కపూర్. మొన్నటివరకు శ్రీదేవి పెద్ద కూతురు న్యూయార్క్ లో ఉంది. అక్కడి నుంచి ఇండియాకి రాగానే మళ్ళీ మాల్దీవుల ఫ్లయిట్ ఎక్కింది.

జాన్వీ అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి బీచుల్లో షికార్లు చేస్తోంది. తానూ ఎంజాయ్ చేస్తూ తన అభిమానులకు కూడా కనువిందు కలిగిస్తోంది. ఎందుకంటే ఆమె బికినీ ఫోటోలను షేర్ చేస్తోంది మరి.

Also Check Photos: Janhvi Kapoor’s bikini look from Maldives

మంచి అందెగత్తెగా పేరు తెచ్చుకున్న జాన్వికి పెద్ద హిట్స్ లేవు. మొదటి సినిమా ‘ధఢక్’ మాత్రమే థియేటర్లలో విడుదలై విజయం సాధించింది. మిగతావన్నీ ఓటిటిలోనే డైరెక్ట్ గా రిలీజ్ అయ్యాయి. ఐతే, ఆమె సంపాదన మాత్రం ఫుల్లుగా ఉంది. అత్యధిక పారితోషికం తీసుకునే యంగ్ హీరోయిన్లలో జాన్వీ కూడా ఉంది. అందుకే లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆమెకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

 

More

Related Stories