శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని తమ కులదైవంగా భావిస్తారు శ్రీదేవి కుటుంబ సభ్యులు. తల్లి శ్రీదేవిలాగే జాన్వీ కపూర్ కూడా తరుచుగా శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ రోజు (ఆగస్ట్ 28న) వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె దర్శించుకున్నారు.

హాఫ్ సారీ కట్టుకొని ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

తితిదే ఆలయ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి స్వామివారి దర్శనం కలిగేలా చేశారు. దర్శన అనంతరం వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆమె ఈ ఏడాది రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు.

జాన్వీ కపూర్ తెలుగులో కూడా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొంటుందని టాక్.

Advertisement
 

More

Related Stories