44 కోట్లకు అమ్మిన జాన్వీ

Janhvi Kapoor


జాన్వీ కపూర్ చేసిన సినిమాలు తక్కువే. కానీ బాగా రిచ్. తల్లి శ్రీదేవి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఎక్కువే. ఆమె కూడా హీరోయిన్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా బాగానే సంపాదించింది. కరోనా కన్నా ముందు ఆమె ఒక ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ తీసుకొంది. రెండేళ్ల తర్వాత ఆమెకి 5 కోట్ల లాభం వచ్చిందట.

ఆమె ముంబైలోని జుహు ప్రాంతంలో తన పేరుమీదున్న ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ ని అమ్మేసింది. 2020లో ఆమె జుహూలోని ఒక అపార్ట్మెంట్ లో 14,15, 16 అంతస్తులను 39 కోట్లు పెట్టి తీసుకొందట. ఇప్పుడు ఆ ట్రిప్లెక్స్ ఇల్లును మంచి లాభానికి ఇచ్చేసింది.

ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు జాన్వీ కపూర్ నుంచి ఈ ఇల్లు కొనుగోలు చేశాడు. ఆమెకి అక్షరాలా 44 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకున్నాడట. ఆమె రెండేళ్ల క్రితం 39 కోట్లకు తీసుకుంటే ఆమె నుంచి రాజ్ కుమార్ రావు 44 కోట్లకు కొన్నాడు. అంటే 5 కోట్లు ఆమెకి లాభం.

జాన్వికి సొంత ఇల్లు, ఇతర ఆస్తులు ముంబైలో ఉన్నాయి. తల్లి నుంచి, తండ్రి నుంచి వచ్చినవి, అలాగే తాను సొంతంగా తీసుకున్నవి కూడా ఉన్నాయి.

 

More

Related Stories